: 3,900 కిలోల కురులు అమ్ముడుపోయాయ్!... శ్రీవారికి ఏకంగా రూ.6.10 కోట్ల ఆదాయం
తిరుమల తిరుపతి వేంటేశ్వరుడికి తలనీలాల ద్వారా ఏకంగా రూ.6.10 కోట్ల ఆదాయం వచ్చింది. భక్తులు శ్రీవారికి సమర్పించే తలనీలాలను నెలకోసారి అధికారులు వేలం వేసే సంగతి విదితమే. టీటీడీ అధికారులు ఈరోజు ఈ-వేలం ద్వారా తలనీలాలను విక్రయించారు. దీనిలో 3,900 కిలోల కురులు అమ్ముడుపోయాయి. వీటిద్వారా అధిక మొత్తంలో ఆదాయం వచ్చింది. తలనీలాలను విక్రయించే క్రమంలో పారదర్శకతను చూపుతుండడంతోనే వాటి ద్వారా శ్రీవారికి భారీగా ఆదాయం వస్తోంది.