: రియోలో విరిగిన ఫ్రెంచ్‌ జిమ్నాస్ట్‌ కాలు.. వెనుదిరిగిన 2013 యూరోపియన్‌ ఛాంపియన్‌


బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జ‌రుగుతున్న ఒలింపిక్స్-16 అర్హ‌త పోటీల్లో 2013 యూరోపియన్‌ ఛాంపియన్‌, ఫ్రెంచ్‌ జిమ్నాస్ట్‌ సమీర్‌ ఐత్‌ సయీద్ మోకాలి కింది ఎముక విరిగింది. పతకం సాధించడమే లక్ష్యంగా రియోకి వచ్చిన ఆయన గాయంతోనే వెనుదిరిగాడు. సయీద్‌కు అనుకోని ప్రమాదం జరగడంతో స్టేడియంలోని ప్రేక్ష‌కులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. వాల్ట్‌, రింగ్స్‌లో విన్యాసాల ప్రదర్శన చేస్తుండగా సరైన రీతిలో ల్యాండ్‌ కాకపోవడంతో ఆయ‌న‌కు ఈ ప్ర‌మాదం జ‌రిగింది. దాంతో సయీద్ తన చేతులతో కళ్లు మూసుకొని బాధను ఓర్చుకుంటూ స్టేడియంలో ఉండిపోయాడు. పారామెడికల్‌ సిబ్బంది సయీద్‌కు ప్ర‌థ‌మ‌చికిత్స అందించి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న ఆసుప‌త్రికి వెళుతుండ‌గా స్టేడియంలోని అభిమానులు ఆయ‌న‌కు నిల‌బ‌డి వీడ్కోలు ప‌లికారు. అంత‌టి బాధ‌లోనూ సయీద్ త‌న‌ చేతిని పైకెత్తి అభిమానుల‌కు అభివాదం చేశాడు.

  • Loading...

More Telugu News