: తెలంగాణకు తెలుగులో వందనాలు చెప్పిన మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు తెలుగులో వందనాలు చెప్పారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తోన్న మహా సమ్మేళనం కార్యక్రమంలో ఆయన తెలుగులో తన ప్రసంగం ప్రారంభిస్తూ.. ‘సోదర సోదరీమణులారా నమస్కారం.. తెలంగాణకు వందనం’ అని అన్నారు. మూడేళ్ల క్రితం ఇక్కడ జరిపిన తన సభకు ప్రజలు టికెట్లు కొనుక్కొని వచ్చారని ఆయన అన్నారు. రాజకీయ సభకు టికెట్లు కొనుక్కొని రావడం కొత్త చరిత్రని అన్నారు. హైదరాబాదీయులు ఆ కొత్త చరిత్ర సృష్టించారని వ్యాఖ్యానించారు. తనకిక్కడ తెలంగాణ భవిష్యత్తు కనిపిస్తోందని అన్నారు.