: ఎల్బీస్టేడియం చేరుకున్న మోదీ... కోలాహలంగా బీజేపీ శ్రేణులు


మెదక్ జిల్లాలోని గ‌జ్వేల్‌లో కోమటిబండలో పలు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేసి, ప్ర‌సంగించిన అనంత‌రం ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్క‌డి నుంచి ఎల్బీ స్టేడియానికి వ‌చ్చారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ స్టేడియంలో ఈరోజు మ‌హా స‌మ్మేళ‌నం కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మోదీ రాకతో స్టేడియం ప్రాంగ‌ణంలో బీజేపీ కార్య‌కర్త‌లు, నేత‌లు ఉత్సాహంగా క‌నిపిస్తున్నారు. మ‌హాస‌మ్మేళ‌నంలో మోదీతో పాటు కేంద్ర‌మంత్రులు, రాష్ట్ర బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులనుద్దేశించి మోదీ కాసేప‌ట్లో ప్ర‌సంగించ‌నున్నారు.

  • Loading...

More Telugu News