: గోరక్షకులపై మోదీ వ్యాఖ్యలు ఓటుబ్యాంకును కాపాడుకునేందుకే!: కాంగ్రెస్, సీపీఎం
గోరక్షకులపై నిన్న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, సీపీఎం నేతలు విమర్శలు గుప్పించారు. దళిత ఓటుబ్యాంకును కాపాడుకునేందుకే మోదీ గోరక్షకులపై ఆగ్రహం వ్యక్తం చేశారని సీపీఎం విమర్శించింది. గోరక్ష పేరుతో జరుగుతోన్న దాడులపై మోదీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ, సంఘ వ్యతిరేక శక్తులపై కఠినంగా ఎందుకు వ్యవహరించడం లేదని సీపీఎం నేత బృంద కారత్ ప్రశ్నించారు. మోదీ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ కాంగ్రెస్ కూడా మోదీపై విమర్శలు గుప్పించింది. మోదీ తన సొంతరాష్ట్రంలో మునిగిపోతోన్న బీజేపీ నావను కాపాడుకోవాలనే ఇటువంటి వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టామ్ వడ్డకన్ అన్నారు. ప్రధాని రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానే గోరక్షకులపై మండిపడ్డారని ఆయన అన్నారు. గుజరాత్‌లో బీజేపీ అధికారం నుంచి పోయే పరిస్థితి నెలకొంది కాబట్టే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు.