: ప్రకాశం జిల్లాలో బీభత్సం సృష్టించిన ఆవు
ప్రకాశం జిల్లాలో ఈరోజు ఓ ఆవు బీభత్సం సృష్టించింది. అర్ధవీడు మండలం మొహిద్దీన్‌పురంలో ఒక్కసారిగా అక్కడి ప్రజలపైకి వెళ్లి దాడి చేసింది. ముందుకు దూసుకుపోతూ జనాలని కొమ్ములతో పొడిచింది. పిచ్చి పట్టినట్లు ఆవు ప్రవర్తించడంతో జనం తీవ్ర ఆందోళన చెందారు. ఆవు చేసిన దాడిలో పది మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.