: 1400 మంది పట్టే చైనా బస్సు గురించి తెలుసుకోవాలని ఆదేశించిన నరేంద్ర మోదీ


ప్రపంచంలో తొలిసారిగా చైనా తయారు చేసిన ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్సు పలు దేశాలను ఆకర్షిస్తోంది. ఇదే తరహా బస్సును ఇండియాలో రద్దీగా ఉండే నగరాల్లో నడిపితే ఎలా ఉంటుంది? దీని సాధ్యాసాధ్యాలను విశ్లేషించి నివేదిక అందించాలని నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు. హైవే కారిడార్ లపై ట్రాఫిక్ నియంత్రణపై వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో ఆయన సమావేశమై చర్చలు జరుపుతున్న వేళ ఈ బస్సు ప్రస్తావన వచ్చింది. టీఈబీ-1 పేరిట చైనాలో తయారైన ఈ బస్సు సబెయి ప్రావిన్స్ లోని కిన్ హువాంగ్ డావో నగరంలో విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. అటు పర్యావరణానికీ అనుకూలంగా ఉండే బస్సులో ఒకేసారి 1400 మంది ప్రయాణించవచ్చు. ఇదే సమయంలో బస్సు కింద నుంచి ఇతర వాహనాల ప్రయాణానికి కూడా అనువుగా ఉంటుంది. రోడ్డుకు రెండు మీటర్ల ఎత్తులో బస్సు ఉంటుంది. వీటితో నగరాల్లో ట్రాఫిక్ అవసరాలను తీర్చడంతో పాటు మెట్రో రైళ్లు, సబర్బన్ రైళ్ల కంటే చౌకగా వీటిని తయారు చేసుకోవచ్చు. దీంతో ఈ తరహా బస్సు ప్రయోగాలు చేపట్టాలని పలు దేశాలు ఆసక్తిగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News