: ఆనాడు ఎన్టీఆర్ నే ప్రభావితం చేసిన దూబగుంట రోశమ్మ మృతి


దూబగుంట రోశమ్మ... ఈ పేరు గుర్తుందా? 1990 దశకంలో నెల్లూరు జిల్లా కలిగిరి మండల పరిధిలోని తూర్పు దూబగుంట గ్రామం నుంచి మద్య నిషేధాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ప్రారంభించిన వర్దినేని రోశమ్మ. ఆనాటి ఉద్యమం రోజురోజుకూ పెరిగి ఉవ్వెత్తున లేవగా, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న ఎన్టీఆర్ ప్రభావితమై, తమ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి, ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇచ్చిన హామీని అమలు చేశారు కూడా. రోశమ్మకు లభించిన గుర్తింపు ఆమె ఇంటిపేరును దూబగుంటగా మార్చేసింది. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, తన 93 ఏళ్ల వయసులో ఈ ఉదయం మరణించారు. కిడ్నీలు పాడైపోయిన దశలో డయాలసిస్ చేయించుకునే శక్తి లేక వైద్యానికి దూరమైన ఆమె, రెండు రోజులుగా ఆహారం తీసుకోలేదని, ఈ ఉదయం కన్నుమూసిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News