: కృష్ణమ్మ చెంత కొలువుదీరిన వెంకన్న


విజయవాడలోని స్వరాజ్ మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటైన వెంకటేశ్వర స్వామి నమూనా ఆలయాన్ని కొద్దిసేపటి క్రితం పురోహితులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. కృష్ణానది నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో ఆలయాన్ని సంప్రోక్షించి, విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. రోజూ లక్ష మంది దర్శించుకునేలా నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. కృష్ణా పుష్కరాలు ముగిసే వరకూ తిరుమల స్వామివారికి చేసే అన్ని రకాల పూజలను ఇక్కడ నిర్వహిస్తామని, వచ్చే భక్తులకు ప్రసాద వితరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామివారిని దర్శించుకున్నారు. పెద్దఎత్తున భక్తులు ఆలయం వద్దకు చేరుకుని స్వామి దర్శనం కోసం వేచి చూస్తున్నారు.

  • Loading...

More Telugu News