: గో రక్షకుల పేరిట సంఘ విద్రోహులు... నాకు కోపం వస్తోంది: మోదీ

గో సంరక్షణ పేరిట కొందరు సంఘ విద్రోహులు దళితులపై జరిపిన దాడుల ఘటనలతో తనకెంతో ఆగ్రహం వచ్చిందని, ఈ తరహా ఘటనలు ఇకపై జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. గో రక్షణ పేరిట వీరు వ్యాపారం చేస్తున్నారని, నిజమైన గో భక్తులు విడిగా ఉంటారని అన్నారు. నిన్న రాత్రి న్యూఢిల్లీలోని టౌన్ హాల్ లో ప్రజలతో సమావేశమైన ఆయన "గో రక్షక్ పేరిట గత నెలలో నలుగురు గుజరాత్ యువకులపై దాడి జరిగింది. దీన్ని అందరూ ఖండించాలి. కొందరు క్రిమినల్స్ ఈ పని చేశారు. ఘటనను తెలుసుకున్న నేను కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాను" అని 'మై గవ్' ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజల సందేహాలు తీర్చేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ అన్నారు. గో రక్షకుల్లో 70 శాతం మంది వరకూ సంఘ విద్రోహులే ఉన్నారన్న అనుమానాలున్నాయని, తాము ఆవులను సంరక్షిస్తున్నామని చెప్పుకుంటూ, వీరంతా తమ తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారని అన్నారు. నిజమైన గో భక్తులు ఎవరైనా ఉంటే, ఆవులు ప్లాస్టిక్ వ్యర్థాలను తినకుండా నివారించాలని కోరారు.

More Telugu News