: రియో ఒలింపిక్స్ లో బాంబు పేలుడు... భయంతో పరుగులు పెట్టిన ఆటగాళ్లు!
బ్రెజిల్ లో రియో ఒలింపిక్స్ సందర్భంగా సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్న ట్రాక్ వద్ద కొద్దిసేపటి క్రితం పెద్ద శబ్దంతో బాంబు పేలింది. దీంతో ఆటగాళ్లు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు పెట్టారు. విషయం తెలుసుకుని వెంటనే స్పందించిన భద్రతా దళాలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని ఘటనా స్థలంలో విస్తృత సోదాలు చేపట్టాయి. బాంబు పేలుడు ఘటనలో ప్రాణ నష్టం ఏమీ జరగలేదని ప్రాథమిక సమాచారం. ఎవరు దీన్ని పేల్చారన్నది తెలియరాలేదు. దీని వెనుక విద్రోహ చర్య ఏమైనా ఉందా? అన్న విషయమై అధికారులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.