: జ‌మ్మూక‌శ్మీర్‌లో చొర‌బాటుకు య‌త్నించిన ఉగ్ర‌వాదులు.. భారీగా పేలుడు ప‌దార్థాలు స్వాధీనం


జ‌మ్మూక‌శ్మీర్‌లో ఈరోజు మ‌రోసారి ఉగ్ర‌వాదులు అల‌జ‌డి సృష్టించారు. అక్క‌డి నౌగామ్ సెక్టార్‌లో ఈరోజు ఉగ్ర‌వాదులు చొర‌బాటుకు ప్ర‌య‌త్నించారు. గ‌మనించిన భ‌ద్రతాదళాలు వేగంగా స్పందించి వారిపై ఎదురుదాడికి దిగాయి. దీంతో భద్ర‌తా ద‌ళాలు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య కాల్పులు జ‌రిగాయి. భ‌ద్ర‌తా ద‌ళాల కాల్పుల్లో ఓ ఉగ్ర‌వాది హ‌త‌మ‌య్యాడు. ఘ‌ట‌నా స్థ‌లిలో భారీగా పేలుడు ప‌దార్థాలు, ఆయుధాలు ల‌భించాయి. దీనిపై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News