: కశ్మీర్‌లో ఏర్ప‌డిన ఉద్రిక్త ప‌రిస్థితుల‌పై మోదీ ఎప్పుడు మౌనం వీడతారు?: ఒమర్‌ అబ్దుల్లా


కశ్మీర్‌లో ఏర్ప‌డిన ఉద్రిక్త ప‌రిస్థితుల‌పై జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఒమర్‌ అబ్దుల్లా స్పందించారు. నిన్న కూడా అక్క‌డ ముగ్గురు మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో ఉద్రిక్తత నెల‌కొన్న అంశంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎందుకు స్పందించ‌డం లేద‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌శ్నించారు. మోదీ ఎప్పుడు మౌనం వీడతారు? అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. క‌శ్మీర్‌లో జ‌రుగుతోన్న అల్ల‌ర్ల‌లో సామాన్యులు మృతి చెందుతూనే ఉన్నార‌ని, ఎంతో మంది గాయాల‌పాల‌వుతూనే ఉన్నార‌ని ఆయ‌న అన్నారు. క‌శ్మీర్లో అటువంటి ప‌రిస్థితి ఉంటే సుప్రీంకోర్టుకు మాత్రం అక్క‌డి పరిస్థితులు మెరుగుపడుతున్నాయంటూ కేంద్రం తెలుపుతోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News