: బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్‌కి షాకింగ్ ఆఫర్


బ్రెగ్జిట్ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌కి తాజాగా విస్మయం కలిగించే ఓ ఆఫర్ వ‌చ్చింది. ప్ర‌ధాని బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్న ఆయ‌న.. ప్ర‌స్తుతం ఎంపీగా కొన‌సాగాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. రానున్న ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయాల‌ని అనుకుంటున్నారు. అయితే, ఆయన తాజాగా ఆయన ఓ సర్ప్రైజ్ ఆఫర్ అందుకున్నారు. కజికిస్థాన్ నుంచి నేరుగా కామెరాన్ కార్యాలయానికి జాబ్ ఆఫర్ అంటూ ఓ లెటర్ వచ్చింది. తమ దేశ సుల్తాన్ గా కామెరాన్ ఉండాలని అందులో పేర్కొన్నారు. దానికి వేతనంగా ఏడాదికి 32 మిలియన్‌ పౌండ్లు (రూ. 314,49 కోట్లు) ఇస్తామని పేర్కొన్నారు. దానికి కామెరూన్ కి ఉండాల్సిన అర్హత గురించి పేర్కొంటూ ఆయన ముస్లింలలా 'సుంతి' చేయించుకోవాలని చెప్పారు. ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం కజకిస్థాన్‌కి అల‌వాటే. గ‌తంలో ఆ దేశ నియంత పాలకుడు మురాత్‌ తెలిబెకోవ్ (76) పలు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. దేశానికి అధ్య‌క్షుడిగా ఉండేవారి వయస్సు 80 ఏళ్లు దాటి ఉంటే వారిని ఉరితీసేయాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అంతేగాక‌ లంచాన్ని చట్టబద్ధం చేయాల‌ని కూడా అన్నారు.

  • Loading...

More Telugu News