: ‘మనమంతా’లో నా పాత్ర నిజజీవితంలో ఉన్న పాత్ర‌లాగే అనిపించింది: న‌టి గౌతమి


మోహన్ లాల్, గౌతమి, విశ్వాంత్, రైనారావు, గొల్లపూడి మారుతీరావు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తాజా చిత్రం ‘మ‌న‌మంతా’. చంద్ర‌శేఖర్ యేలేటీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఈ సినిమా ప‌బ్లిసిటీలో భాగంగా గౌతమి, రైనారావు ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా నటి గౌతమి మాట్లాడుతూ.. ఓ మధ్యతరగతి గృహిణిగా ‘మనమంతా’ సినిమాలో మంచి పాత్రలో కనపడతానని తెలిపారు. మధ్యతరగతి మనుషులకు ఎదురయ్యే అవమానాలు, సమస్యలు, బాధలు అనుభవిస్తూ సినిమాలో కనపడతానని ఆమె పేర్కొన్నారు. నిజ‌జీవితంలో తాను పోషించే త‌ల్లి పాత్రలాగే మ‌న‌మంతా సినిమాలో కనిపించానని ఆమె చెప్పారు. సినిమాలో చాలా సహజంగా న‌టించినట్లు ఆమె పేర్కొన్నారు. అందుకే, నిజ జీవితంలోని పాత్ర‌లాగే అనిపించిందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News