: సుప్రీం చీఫ్ జస్టిస్ తో కేసీఆర్ భేటీ!... హైకోర్టును విభజించాలని వినతి!
సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేటి ఉదయం హైదరాబాదుకు వచ్చారు. హైదరాబాదులోని నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన జస్టిస్ ఠాకూర్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమాజీగూడలోని రాజ్ భవన్ లో బస చేసిన జస్టిస్ ఠాకూర్ వద్దకు వెళ్లిన కేసీఆర్... రాష్ట్ర విభజన తర్వాత ఇంకా పెండింగ్ లోనే ఉన్న హైకోర్టు విభజన అంశాన్ని ప్రస్తావించారు. హైకోర్టు విభజన త్వరితగతిన జరిగేలా చూడాలని ఆయన జస్టిస్ ఠాకూర్ ను కోరారు.