: నాకే ఆ అధికారం ఉంటే... దానిని మీకే ఇచ్చేవాడిని!: ‘హోదా’పై చంద్రబాబుతో అద్వానీ వ్యాఖ్య!


రాష్ట్ర విభజన, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా పుష్కరాలకు రావాలంటూ తనను ఆహ్వానించేందుకు వచ్చిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఆయన నిన్న సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఏపీకి ప్రత్యేక హోదా అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ‘‘ఏపీకి అన్యాయం జరగకూడదు. రాష్ట్రానికి ఏమేం ఇవ్వాలో అవన్నీ త్వరగా ఇచ్చేయాలి. ఏపీకి ఇవ్వాల్సిన వాటిని ఎందుకు పెండింగ్ పెడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. తెలంగాణ వారు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు. రాష్ట్రం ఏర్పాటైపోయింది. మరి ఆంధ్రా సంగతేంటి? ఏపీకి ఏమేం ఇవ్వాలో కచ్చితంగా ఇవ్వాలి. ఏపీ, తెలంగాణ, కేంద్రం నుంచి ఒక్కొక్కరు చొప్పున కూర్చుని ఈ అంశాలను తేల్చేయాలి’’ అని అద్వానీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కల్పించుకుని ఏపీకి న్యాయం జరిగేలా చూడండని ఆయనను కోరారు. దీనికి స్పందించిన అద్వానీ ‘‘ఒకవేళ నాకే కనుక ఆ అధికారం ఉంటే... నిర్ణయాధికారం మీకే ఇచ్చేవాడిని’’ అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News