: శ్రావెల్ కు బెయిల్ నిరాకరణ!... రమ్య మృతి కేసులో నాంపల్లి కోర్టు నిర్ణయం!


మైనారిటీ తీరకుండానే మద్యం సేవించి కారుతో బీభత్సం సృష్టించి ఓ కుటుంబానికి తీవ్ర వేదన మిగిల్చిన శ్రావెల్ కు బెయిల్ లభించలేదు. గత నెలలో పంజాగుట్ట ఫ్లై ఓవర్ పై జరిగిన ప్రమాదంలో శ్రావెల్ కారు ఢీ కొట్టడంతో వేరే కారులో ప్రయాణిస్తున్న చిన్నారి రమ్యతో పాటు బాలిక తండ్రి, తాతయ్య చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రావెల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని అతడు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై కొద్దిసేపటి క్రితం విచారణ చేపట్టిన కోర్టు... శ్రావెల్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

  • Loading...

More Telugu News