: సోమ, మంగళవారాల్లో టీడీపీ ఎంపీలంతా పార్లమెంటులో ఉండాల్సిందే!... విప్ జారీ చేసిన టీడీపీ!


వచ్చే వారం పార్లమెంటు సమావేశాలు మరింత రసవత్తరంగా సాగనున్నాయి. పలు కీలక బిల్లులు ఉభయ సభల ముందుకు రానున్న నేపథ్యంలో వాటి ఆమోదం కోసం ఇప్పటికే అధికార బీజేపీ పక్కా వ్యూహాలు రచిస్తోంది. అయితే సదరు బిల్లుల్లో తాము ప్రతిపాదిస్తున్న మార్పులు చేర్పులకు సంబంధించి విపక్షాలు ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో అధికార పార్టీ, ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ తన ఎంపీలకు కొద్దిసేపటి క్రితం విప్ జారీ చేసింది. కీలక బిల్లులపై చర్చ, ఓటింగ్ ఉన్న నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో పార్టీ ఎంపీలంతా సభకు హాజరుకావాల్సిందేనని ఆ విప్ లో టీడీపీ పేర్కొంది.

  • Loading...

More Telugu News