: హాల్‌టికెట్ నెంబ‌ర్‌, ప‌రీక్ష కేంద్రాలు మారుతాయి: ఎంసెట్-3 క‌న్వీన‌ర్


హైద‌రాబాద్‌లోని కూక‌ట్‌ప‌ల్లి జేఎన్‌టీయూలో స‌మావేశ‌మైన ఎంసెట్‌-3 క‌మిటీ, ప‌రీక్ష‌ నిర్వ‌హ‌ణ అంశాల‌ను చ‌ర్చించి ప‌లు కీలక నిర్ణ‌యాలు తీసుకుంది. సమావేశంలో ఛైర్మన్ పాపిరెడ్డి, జేఎన్‌టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ యాదయ్య సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఎంసెట్-2 ప్ర‌శ్న‌ప‌త్రం లీకైన నేప‌థ్యంలో ఎంసెట్-3ని సెప్టెంబర్ 11న నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్‌ను ఈనెల 8న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఎంసెట్‌-3 క‌న్వీన‌ర్ ఈ సంద‌ర్భంగా మీడియాకు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఎంసెట్‌-3 వెబ్‌సైట్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. అయితే, హాల్‌టికెట్ నెంబ‌ర్‌, ప‌రీక్ష కేంద్రాలు మారుతాయని ఆయ‌న చెప్పారు. కొత్త హాల్‌టికెట్లను వ‌చ్చేనెల 3 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News