: కర్నూలు జిల్లాలో దేవినేని ఉమా!... కాసేపట్లో పోతిరెడ్డిపాడు నుంచి ‘సీమ’ ప్రాజెక్టులకు నీటి విడుదల!


ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టిసీమ పథకం ఫలాలు మరికాసేపట్లో రాయలసీమ జిల్లాలకు అందనున్నాయి. పట్టిసీమ తొలి ఫలాన్ని రాయలసీమ జిల్లాలకు అందించేందుకు టీడీపీ సీనియర్ నేత, ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొద్దిసేపటి క్రితం కర్నూలు చేరుకున్నారు. మరికాసేపట్లోనే ఆయన కర్నూలు నుంచి బయలుదేరి జిల్లాలోని జూపాడుబంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్దకు చేరుకుంటారు. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో మరో నాలుగు రోజుల్లోనే జలాశయం పూర్తిగా నిండిపోనుంది. ఇదిలా ఉంటే... పట్టిసీమ ద్వారా పోలవరం కుడి కాలువ మీదుగా 6.2 టీఎంసీల గోదావరి జలాలను ప్రభుత్వం కృష్ణా డెల్టాకు మళ్లించింది. అంతే మొత్తం కృష్ణా జలాలను (6.2 టీఎంసీలు) పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ రాయలసీమ ప్రాజెక్టుకు నీటిని వదలాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆ నీటిని పోతిరెడ్డిపాడు నుంచి ‘సీమ’ కాలువలకు విడుదల చేసేందుకు దేవినేని ఉమా కర్నూలు చేరుకున్నారు.

  • Loading...

More Telugu News