: చింతల్ లో నారాయణ విద్యాసంస్థల భవనాలు సీజ్!... రెండు భవనాలు స్థానిక ఎమ్మెల్యేవే!


తెలంగాణలో కార్పొరేట్ విద్యలో పేరుగాంచిన నారాయణ విద్యాసంస్థలకు మరో ఇబ్బంది తలెత్తింది. హైదరాబాదు శివారు ప్రాంతం చింతల్ లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కు చెందిన రెండు భవనాలను అద్దెకు తీసుకున్న నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం వాటిలో కళాశాల, టెక్నో స్కూళ్లను నడుపుతోంది. అయితే ఆ రెండు భవనాలకు ప్రభుత్వ అనుమతులు లేవట. దీనిని కాస్త ఆలస్యంగా గుర్తించిన అధికార యంత్రాంగం కొద్దిసేపటి క్రితం ఆ రెండు భవనాలను సీజ్ చేసింది. ఉన్నపళంగా భవనాలను అధికారులు సీజ్ చేయడంతో విద్యార్థులు రోడ్డునపడ్డారు.

  • Loading...

More Telugu News