: ఇస్రోతో తెలంగాణ సర్కారు కీలక ఒప్పందం!... దేశంలోనే ఈ తరహా ఒప్పందాల్లో ఇదే ప్రథమమట!


భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో)తో తెలంగాణ సర్కారు కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాదులో నేటి ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ ల సమక్షంలో ఇరు వర్గాలకు చెందిన అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం... ఇకపై సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు, కాల్వలకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం డ్రోన్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. ఈ తరహా వివరాల కోసం ఇస్రో సహకారం తీసుకుంటున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది.

  • Loading...

More Telugu News