: మంత్రుల చాంబర్లు చిన్నగా ఉన్నాయట!... తాత్కాలిక సచివాలయంలో రేపటి ప్రారంభోత్సవాలు వాయిదా!


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలో నిర్మాణం దాదాపుగా పూర్తి చేసుకున్న తాత్కాలిక సచివాలయంలో రేపు పలువురు మంత్రులు కార్యాలయ ప్రవేశం చేయాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి ఈ ప్రారంభోత్సవాలన్నీ వాయిదా పడ్డాయి. ఇందుకు కారణమేంటంటే... మంత్రుల కోసం నిర్మించిన చాంబర్లన్నీ చాలా చిన్నగా ఉండటమేనట. తమకు కేటాయించిన చాంబర్లలో ప్రవేశించేందుకు రేపటి రోజును సుముహూర్తంగా నిర్ణయించుకున్న పలువురు మంత్రులు ఇటీవలే వాటిని పరిశీలించారు. తాము అనుకున్న దాని కంటే సదరు చాంబర్లు చాలా చిన్నవిగా ఉండటంతో మంత్రులంతా షాక్ తిన్నారట. దీంతో వెనువెంటనే మంత్రులంతా కలిసి మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వద్ద తమ ఆవేదనను వెళ్లగక్కారు. సహచర మంత్రుల వాదనపై పరిశీలన జరిపిన నారాయణ సదరు చాంబర్లను మరింత పెద్దగా విస్తరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీంతోనే రేపటి మంత్రుల చాంబర్ల ప్రవేశం వాయిదా పడింది. ఈ పనులు పూర్తి అయిన తర్వాత మరో మంచి ముహూర్తాన మంత్రులు తమ చాంబర్లలో ప్రవేశించనున్నారు.

  • Loading...

More Telugu News