: ఉల్లాసంగా, ఉత్సాహంగా చంద్రబాబు!... మోదీ హామీతో ఏపీ సీఎం మోములో చిద్విలాసం!


ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా నిరాశగా తిరిగివచ్చే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ సారి మాత్రం ఉల్లాసంగానే కాకుండా ఉత్సాహంగా కూడా కనిపించారు. మొన్ననే ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు... మొన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించారు. ఆ తర్వాత నిన్న 11.30 గంటలకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని తనకు వదిలేసి నిశ్చింతగా వెళ్లిరండి అన్న మోదీ పలుకుతో చంద్రబాబు ఉల్లాసంగా బయటకు వచ్చారు. ఇక ఆ తర్వాత బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ వద్దకు వెళ్లిన సమయంలో చంద్రబాబు ఉల్లాసమంతా స్పష్టంగా కనిపించింది. పార్టీ ఎంపీలు, కీలక నేతలను వెంటబెట్టుకుని అద్వానీ వద్దకు వెళ్లిన చంద్రబాబు అక్కడ మనసారా నవ్వారు. మోదీ హామీతోనే చంద్రబాబు మోములో ఈ తరహా ఉల్లాసం కనిపించిందట.

  • Loading...

More Telugu News