: విశ్వక్రీడా సంబరం ఆరంభ వేడుకలు అదరహో!


అతిపెద్ద విశ్వక్రీడా సంబరం ఒలింపిక్స్‌కు తెరలేచింది. రియో డిజెనీరోలోని మరకానా స్టేడియం శోభాయమానమైంది. బాణాసంచా వెలుగులతో నిండిపోయింది. భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. మూడున్నర గంటలపాటు సాగిన ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. విద్యుత్ దీపాలు, బాణాసంచా వెలుగులతో స్టేడియం దేదీప్యమానమైంది. మైదానంలో ఆరువేల మంది కళాకారులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. కల్చరల్ ఈవెంట్స్ అదుర్స్ అనిపించాయి. ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఒలింపిక్ జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించాడు. భారత్‌కు ఒలింపిక్స్‌లో తొలి వ్యక్తిగత స్వర్ణ పతకం అందించిన అభినవ్ బింద్రా వేడుకల్లో జాతీయ జెండాతో భారత బృందాన్ని నడిపించనున్నాడు. ఈ సారి ఒలింపిక్స్‌ బరిలో భారత్ నుంచి 118 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. వందమందికిపైగా భారత క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. మరకానా సహా మొత్తం 37 వేదికల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈనెల 21 వరకు పోటీలు జరుగుతాయి.

  • Loading...

More Telugu News