: పధ్ధతి మారలేదు... హైదరాబాద్‌లో అతివేగంతో బైక్ నడిపిన మైనర్.. ఒకరి మృతి
హైదరాబాద్‌లో వాహనాలు నడుపుతోన్న మైనర్లను హెచ్చరిస్తూ పోలీసులు ఎంతగా చర్యలు తీసుకుంటున్నా అటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మైనర్లకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చినా తీరులో మార్పు కనపడడం లేదు. ఈరోజు వాహన లైసెన్సు లేని ఓ మైనర్ బాలుడు అతివేగంతో బైక్‌ని నడిపి రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి వద్ద డివైడర్‌ను వేగంగా ఢీ కొన్నాడు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గాయాలపాలయిన మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.