: నిర్ణయం వచ్చేసింది.. గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ రూపాని పేరు ఖరారు
గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రిపై తీవ్ర కసరత్తు చేసిన భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం ఈరోజు సాయంత్రం గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటించింది. బీజేపీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి విజయ్ రూపానీని కొత్త ముఖ్యమంత్రిగా నియమించనున్నట్లు తెలిపింది. ఉపముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ పేరును ఖరారు చేసింది. త్వరలోనే వారి ప్రమాణ స్వీకరణ తేదీలను బీజేపీ ప్రకటించనుంది. గుజరాత్‌లో సమర్థవంతమయిన నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించాలని భావించిన బీజేపీ అధిష్ఠానం చివరకు బీజేపీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి విజయ్ రూపానీనే అందుకు సరయిన నాయకుడిగా నిర్ణయించింది.