: కాంగ్రెస్, వైసీపీలకు ‘హోదా’పై చిత్తశుద్ధి లేదు: కేంద్రమంత్రి సుజనాచౌదరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడానికి ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన హామీ సానుకూలంగా ఉందని కేంద్రమంత్రి సుజనాచౌదరి అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, వైసీపీలకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఎన్నో లోపాలున్నాయని, అందుకే ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు సొంత లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఉన్నారని ఆయన విమర్శించారు.