: జూనియర్ టెన్నిస్ ప్లేయర్‌తో లియాండర్ పేస్ ఈ వయసులో ప్రేమలో పడ్డాడట!
వయసు మీరినా వన్నె తగ్గని భారత టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్(43) ప్రేమలో పడ్డాడట. వేరే ప్రొఫెషన్‌లో ఉన్న వారితో ఎందుకు అనుకున్నాడో ఏమో.. జూనియర్ టెన్నిస్ ప్లేయర్ తన్వీ షా(25) తో ఆయన డేటింగ్ చేస్తున్నాడు. ఆమెను వెంటబెట్టుకొని లియాండర్‌పేస్ జాలీగా తిరిగేస్తున్నాడు. ఈ అంశమే ఇప్పుడు క్రీడావర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇటీవల జరిగిన పేస్ డేవిస్ కప్ మ్యాచ్‌ను చూడడానికి తన్వీ షా చండీగఢ్‌కి వచ్చింది. ఈ సందర్భంగా పేస్, తన్వీల మధ్య ఉన్న లవ్ గురించి ఇప్పటికే తెలిసిన ఓ వ్యక్తి ఆ అంశాన్ని మీడియాకి తెలిపాడు. వీరిరువురూ ప్రేమలో ఉన్నారని, అయితే ప్రస్తుతం వారి లవ్ మేటర్‌ని వెల్లడించడానికి వారు సుముఖత వ్యక్తం చేయడం లేదని ఆయన చెప్పాడు. లియాండర్ పేస్ తన ఆటపైనే దృష్టిసారించాడని, టోర్నీలతో తీరిక లేకుండా గడిపేస్తున్నాడని కూడా ఆ వ్యక్తి వ్యాఖ్యానించడం విశేషం. తన మొదటి భార్య, మోడల్ రియా పిళ్లైతో విభేదాలొచ్చి లియాండర్ పేస్ కోర్టుల చుట్టూ తిరిగిన విషయం తెలిసిందే. తమ కూతురిని ఎవరు చూసుకోవాలనే విషయాన్ని వారు కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటున్నారు. ఆ కేస్‌లో ఇంకా విచారణ జరుగుతుండగానే పేస్ న్యూ లవ్ స్టోరీ స్టార్ట్ చేయడంతో మీడియా మిత్రులు పేస్ నుంచి తన లవ్ మేటర్‌పై మాట్లాడించాలని చూస్తున్నారు.