: బీజేపీ నిర్ణయం తీసేసుకుంది... మనం ఎంత మొత్తుకొని చెప్పినా ఏం ప్రయోజనం?: జేసీ ఆవేదన


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చే ఉద్దేశంలో భారతీయ జనతా పార్టీ లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పరోక్షంగా చెప్పేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసేసుకుందని వెల్లడించిన ఆయన, మనం ఎన్ని చెప్పినా, ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదని తన ఆవేదనను వ్యక్తం చేశారు. కేంద్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉండేలా కనిపిస్తోందని మోదీతో భేటీ అనంతరం వ్యాఖ్యానించిన ఆయన, ఏపీ సమస్యను మిగతా రాష్ట్రాల సమస్యలతో పోల్చి చూడవద్దని ప్రధానిని కోరినట్టు వివరించారు. ఏపీ నష్టపోయిందని ఆయనకు మరోసారి గుర్తు చేశామని, అన్నీ తనకు తెలుసునని, ఆదుకుంటామని మాత్రమే ఆయన చెప్పారని అన్నారు.

  • Loading...

More Telugu News