: 'రియల్లీ షేమ్ ఫర్ బీజేపీ' రాజ్యసభలో తీవ్ర నిరసన!
కేవీపీ ప్రైవేటు బిల్లుపై చర్చ ముగిసిన అనంతరం, ఓటింగ్ కు వెళ్లకుండా లోక్ సభ స్పీకర్ కు రిఫర్ చేస్తున్నట్టు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ప్రకటన చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీలు తీవ్రంగా తప్పుబట్టారు. 'రియల్లీ షేమ్ ఫర్ బీజేపీ.. రియల్లీ షేమ్ ఫర్ బీజేపీ' అంటూ పోడియంలోకి దూసుకెళ్లారు. ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారని రేణుకా చౌదరి అనడం వినిపించింది. 'ఆంధ్రా వాంట్ జస్టిస్' అంటూ సభ్యులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎంపీల నిరసనలను పట్టించుకోకుండా కురియన్ తదుపరి బిల్లును చర్చకు స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు.