: హోదా బిల్లు మనీబిల్లే అయితే, ఆ విషయం ముందు తెలియదా?: జైట్లీకి జైరాం రమేశ్ సూటి ప్రశ్న


రాజ్యసభలో కేవీపీ తెచ్చిన ప్రైవేటు మెంబర్ బిల్లును మనీబిల్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రపతి ఆమోదంతోనే ఈ బిల్లును కేవీపీ ప్రవేశపెట్టారని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు దీన్ని మనీబిల్లుగా ఎందుకు పేర్కొంటున్నారని అడిగారు. ఒకవేళ మనీబిల్లే అయితే, ఆ సంగతి ముందుగా తెలియదా? అంటూ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని ప్రశ్నించారు. అసలెందుకు బిల్లును అనుమతించారని అడిగారు. ఈ బిల్లుపై పూర్తి సభను, పార్లమెంటును, భారత ప్రజాస్వామ్యాన్ని, ఏపీ ప్రజల హక్కులను పక్కదారి పట్టిస్తున్నారని బీజేపీ వైఖరిని దుయ్యబట్టారు. రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తుంటే, ఊరికే కూర్చోబోమని స్పష్టం చేశారు. నాటి ప్రభుత్వం పార్లమెంటులో ఇచ్చిన హామీలను క్యాబినెట్ కూడా ఆమోదించిందని, ఆపై వెంటనే ఎన్నికల కోడ్ రావడంతో అమలు చేయలేకపోయామని గుర్తు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ఇస్తామన్న అన్ని హామీలనూ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News