: మీ పరిస్థితి ఎలా ఉందో మా పరిస్థితీ అలాగే ఉంది!: హోదాపై నాన్చిన నరేంద్ర మోదీ


ఈ మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన చంద్రబాబు ప్రత్యేక హోదా విషయమై ఎటువంటి హామీని పొందకుండానే వెనుదిరిగారు. హోదా గురించి ప్రస్తావిస్తూ, ఆర్థిక ఇబ్బందుల గురించి చంద్రబాబు ప్రధానికి వివరించిన వేళ, కేంద్ర ఖజానా సైతం ఖాళీగానే ఉందని, అదనపు కేటాయింపులు జరిపే అవకాశాలు లేవని ప్రధాని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఏపీలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో కేంద్రం పరిస్థితి కూడా అలానే ఉందని మోదీ వ్యాఖ్యానించినట్టు సమాచారం. ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిలదొక్కుకున్న తరువాత ఏపీకి అనుకున్నవన్నీ చేసి పెడతామన్న ఒక్క భరోసా తప్ప, అందుకు నిర్దిష్ట సమయం, కార్యాచరణను మోదీ చెప్పలేదని పార్టీ వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. మోదీ, చంద్రబాబు భేటీపై మరిన్ని విషయాలు చంద్రబాబు మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News