: అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్ తో ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్లు


ఇండియాలోని నంబర్ వన్ టెలికం సంస్థ ఎయిర్ టెల్, తన పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం బంపరాఫర్ ప్రకటించింది. అపరిమిత వాయిస్ కాల్స్ సౌకర్యాన్ని దగ్గర చేస్తూ కొత్త ప్లాన్లు విడుదల చేసింది. 'ఇన్ఫినిటీ' పేరిట అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ లో కస్టమర్లు నెలకు రూ. 1,199 చెల్లించాల్సి వుంటుంది. వీరికి అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లు 1 జీబీ 3జీ/4జీ డేటా ఉచితంగా అందుతుంది. నేషనల్ రోమింగ్ లోనూ ఎటువంటి రుసుములూ ఉండవు. వింక్ మ్యూజిక్, వింక్ మూవీస్ కు ఉచిత సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. ఇదే సమయంలో రూ. 1,599 ప్లాన్ లో మిగతా అన్ని ఫెసిలిటీస్ తో పాటు 5 జీబీ డేటాను ఇస్తామని సంస్థ కార్య నిర్వహణా విభాగం డైరెక్టర్ అజయ్ పూరి తెలిపారు.

  • Loading...

More Telugu News