: మా సంగతి త్వరగా తేల్చండి: మోదీతో చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని త్వరగా తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ ఉదయం 12 గంటల సమయంలో మోదీని కలిసిన ఆయన, దాదాపు 20 నిమిషాల పాటు సమావేశమై పలు అంశాలను చర్చించారు. ఏకాంతంగా జరిగిన సమావేశంలో చంద్రబాబు ఏం మాట్లాడారన్నది అధికారికంగా వెల్లడి కాకపోయినా, ప్రత్యేక హోదా అంశం చుట్టూనే చర్చలు సాగినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. హోదాతో పాటు ప్యాకేజీ, పన్ను రాయితీలను ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని చంద్రబాబు కోరినట్టు తెలుగుదేశం పార్టీ నేత ఒకరు తెలిపారు. విభజన తరువాత నెలకొన్న సమస్యల పరిష్కారం సైతం ఆలస్యం అవుతోందని ఫిర్యాదు చేసిన ఆయన, తెలంగాణ ప్రభుత్వంతో నెలకొని ఉన్న పలు సమస్యలు కేంద్రం కల్పించుకుంటేనే పరిష్కరించబడతాయని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. నిన్నటి నుంచి ఢిల్లీలో మకాం వేసిన చంద్రబాబు, ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ సహా పలువురు ప్రముఖులను కలుసుకున్నారు. రాష్ట్రంలో 12వ తేదీ నుంచి జరిగే కృష్ణా పుష్కరాలకు రావాలని కేంద్ర మంత్రులను, వీఐపీలనూ స్వయంగా ఆహ్వానిస్తున్నారు.

  • Loading...

More Telugu News