: హసీ.. కసికసిగా..
ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ మైకేల్ హసీ మరో మరపురాని ఇన్నింగ్స్ ఆడాడు. వయసు మీదపడుతున్నా వన్నె తరగని ఆటతో మెరిసిన హసీ నేడు చెపాక్ స్టేడియంలో భారీ షాట్లతో కదంతొక్కాడు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లను చితక్కొట్టిన హసీ కేవలం 59 బంతుల్లో 95 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు. హసీకి తోడు రైనా (44), సాహా (39) రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. కెప్టెన్ ధోనీ 18 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు.