: అక్టోబర్ నెల శ్రీవారి సేవా టికెట్లు విడుదల
అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి సేవా టికెట్ల కోటా ఈ ఉదయం 11 గంటల నుంచి ఆన్ లైన్లో అందుబాటులోకి వచ్చింది. మొత్తం 40,087 వేల టికెట్లను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. వీటిల్లో సుప్రభాతం, నిజపాద దర్శనం, తోమాల సేవ, అర్చన, విశేష పూజ, అష్టదళపాద పద్మారాధన, కల్యాణోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలకు సంబంధించిన టికెట్లు ఉన్నాయి. పూర్తిగా ఆధునికీకరించిన సర్వర్ తో ఈ నెల ఆన్ లైన్ టికెట్లను టీటీడీ ప్రారంభించినప్పటికీ, సర్వర్లు జామ్ అవుతున్నాయి. అమ్మకాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సుప్రభాతం, తోమాల సేవ, అర్చన వంటి కీలక సేవా టికెట్లు అయిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కల్యాణోత్సవం సహా వసంతోత్సవం, దీపాలంకారం, ఆర్జిత బ్రహ్మోత్సవానికి అక్టోబర్ నెలలోని దాదాపు అన్ని రోజులకూ టికెట్లు లభిస్తున్నాయి.