: గుండెపోటుతో మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు కన్నుమూత
మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. ఈ ఉదయం ఆయనకు తీవ్రమైన గుండెపోటు రాగా, బంధువులు ఆసుపత్రికి తరలించే లోపే ఆయన మరణించినట్టు తెలుస్తోంది. కాగా, నేడు ఆయన కొత్తగూడెం క్లబ్ తెదేపా నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొనాల్సి వుంది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీకి ఆయన తిరుగులేని రాజకీయ నేతగా నిలిచారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగానూ సేవలందించారు. ఆయన మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపాన్ని వెలిబుచ్చారు.