: చదువుకునేందుకు వెళ్లి అనంత లోకాలకు... అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి


యూఎస్ లోని సన్నీ వ్యాలీలో జరిగిన కారు ప్రమాదంలో హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు. బంజారాహిల్స్ ప్రాంతంలో నివసించే రాచమళ్ల కృష్ణాగౌడ్ కుమారుడు వినయ్ గౌడ్ (24) కంప్యూటర్ సైన్స్ చదివిన అనంతరం, గత డిసెంబరులో కాలిఫోర్నియాకు వెళ్లి అక్కడి యూనివర్శిటీలో ఎంఎస్ లో చేరాడు. వినయ్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ప్రమాదం జరగడంతో తీవ్రగాయాల పాలై మరణించినట్టు తెలుస్తోంది. వినయ్ మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన అమెరికా అధికారులు మృతదేహాన్ని పంపుతున్నట్టు తెలిపారు. వినయ్ మృతితో కృష్ణా గౌడ్ కుటుంబంలో విషాదం అలముకుంది.

  • Loading...

More Telugu News