: దూసుకెళుతున్న హిల్లరీ... మరింత పడిపోయిన ట్రంప్ విజయావకాశాలు
నవంబరులో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ విజయావకాశాలు మరింతగా పెరిగాయి. తాజాగా జరిగిన మెక్ క్లత్చీ - మార్టిస్ జాతీయ సర్వేలో ఆమెకు 15 శాతం అదనపు ఓట్లు రానున్నాయని, భారీ తేడాతో ట్రంప్ ఓడిపోనున్నారని తేలింది. హిల్లరీ క్లింటన్ కు 48 శాతం ఓట్లు వస్తాయని, ట్రంప్ కు 33 శాతం ఓట్లు పడేట్టున్నాయని సర్వేలో వెల్లడైంది. రెండు రోజుల క్రితం ట్రంప్ కన్నా హిల్లరీకి 9 శాతం వరకూ అధిక ఓట్లు వస్తాయని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రియల్ క్లియర్ జరిపిన సర్వేలో హిల్లరీ క్లింటన్, ట్రంప్ తో పోలిస్తే 6.8 శాతం అదనపు ప్రజాబలంతో ఉన్నారని, మారిస్ట్ ఇనిస్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ సర్వేలో హిల్లరీకి 42 శాతం, ట్రంప్ కు 39 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేసింది.