: మాల్యా ఆస్తులు మాకొద్దు బాబోయ్!... కింగ్ ఫిషర్ హౌస్ వేలానికి స్పందన నిల్!


లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు అడిగిందే తడవుగా ఎడాపెడా రుణాలిచ్చేసిన బ్యాంకులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి. మొత్తం రూ.9 వేల కోట్ల రుణాలను ఎగవేసి మాల్యా ఎంచక్కా లండన్ చెక్కేయగా... దేశంలోని ఆయన ఆస్తులను అమ్ముకునైనా సదరు రుణాలను వసూలు చేసుకోవాలని బ్యాంకులు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఓ దఫా వేలానికి పెట్టిన మాల్యా ఏవియేషన్ సంస్థ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ప్రధాన కార్యాలయం ‘కింగ్ ఫిషర్ హౌస్’కు రెండో దఫా వేలం కూడా నిన్న పూర్తయింది. బ్యాంకులు ఓ మెట్టు దిగి రూ.150 కోట్ల విలువ ఉన్న ఈ భవనాన్ని రూ.15 కోట్ల మేర తగ్గించి రూ.135 కోట్ల ప్రారంభ ధరగా ప్రకటించినా...సింగిల్ బిడ్డర్ కూడా ముందుకు రాలేదు. దీంతో నిన్నటితో ముగిసిన రెండో విడత వేలంలో కూడా ఆ భవనం అమ్ముడుపోలేదు.

  • Loading...

More Telugu News