: సోనియా గాంధీ భుజానికి గాయం!... ఆపరేషన్ చేసిన గంగారాం ఆసుపత్రి వైద్యులు!


ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో రోడ్ షోకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ... రోడ్ షోను మధ్యలోనే ముగించుకున్న సంగతి విదితమే. తీవ్ర అనారోగ్యం కారణంగా రోడ్ షోను మధ్యలోనే నిలిపేసుకున్న సోనియా గాంధీ నేరుగా ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రికి వెళ్లిపోయారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి గంగారాం ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. రోడ్ షోలో భాగంగా సోనియా భుజానికి గాయమైందని, దీంతో ఆమెకు ఆపరేషన్ చేశామని గంగారాం ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగానే ఉందని నిన్న ప్రకటించిన వైద్యులు... ఓ వారం రోజుల పాటు ఆమెను ఆసుపత్రిలోనే ఉంచనున్నట్లు తెలిపారు. ఇక ఆరోగ్యం కాస్తంత మెరుగుపడిన ఆమెను ఐసీయూ నుంచి రూమ్ కి షిప్ట్ చేశామని కూడా వైద్యులు పేర్కొన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఆమెకు ఫిజియోథెరపీ అవసరమవుతుందని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News