: ఈసారి ఎన్ని పతకాలో... వందమందితో తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి భారత్


ఒలింపిక్స్ బరిలోకి తొలిసారి భారత్ వందమందికిపైగా క్రీడాకారులతో రంగంలోకి దిగుతోంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 81 మంది క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత్ ఆరు పతకాలు సాధించింది. ఈసారి 118 మంది క్రీడాకారులతో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఒలింపిక్స్‌లో వందమందికిపైగా భారత క్రీడాకారులు పాల్గొనడం ఇదే తొలిసారి. విశ్వక్రీడల్లో భారత్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని అందించిన షూటర్ అభివన్ బింద్రా ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత జెండా చేబూని క్రీడాకారుల బృందాన్ని ముందుకు నడిపించనున్నాడు. డ్రగ్స్ మాఫియా, జికా వైరస్, దోపిడీలు రియో క్రీడాగ్రామంలో ఒక్కసారిగా పెరిగినట్టు ఇటీవల వరుసగా వార్తలు వెలువడ్డాయి. అయితే క్రీడలు ప్రారంభమయ్యాక ఇవన్నీ సమసిపోతాయని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. వీటిని అరికట్టేందుకు భారీగా భద్రతా దళాలను మోహరించింది. అటు క్రీడాకారులకు, ఇటు అభిమానులకు, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. ఏది ఏమైనా, మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న అతి పెద్ద క్రీడా సంబరం అభిమానులకు తీపి గుర్తుగా మిగులుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

  • Loading...

More Telugu News