: రియో ఒలింపిక్స్.. ఆసక్తి కల్గించే అంశాలు
ఈ నెల 6వ తేదీ, శనివారం ఉదయం 4.30 గంటలకు (ఐఎస్ టీ) ఎంతో వైభవంగా ప్రారంభం కానున్న రియో ఒలింపిక్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు. * రియో డి జనిరో లోని మరక్కానా స్టేడియంలో ఒలింపిక్ ప్రారంభ వేడుక జరుగుతుంది. * ఈ స్టేడియం కెపాసిటీ 78,000+ * స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం. హిందీ, ఇంగ్లీషు భాషల్లో కామెంటరీ * స్టార్ స్పోర్ట్స్.కామ్, హాట్ స్టార్.కామ్ లో లైవ్ స్ట్రీమింగ్ * ఒలింపిక్ క్రీడాకారుల పరేడ్ క్రమంలో మొదటగా గ్రీస్ దేశం స్టేడియంలోకి ప్రవేశించనుండగా, 95వ దేశంగా అడుగుపెట్టనున్న భారత్ క్రీడాకారులు. భారత్ జెండాను ధరించి మన టీమ్ ముందు నడవనున్న ఏస్ షూటర్ అభినవ్ బింద్రా * ఆతిథ్య దేశం బ్రెజిల్ క్రీడాకారులు అన్ని టీమ్ ల కంటే చివరగా స్టేడియంలోకి అడుగుపెడతారు. * ఓపెనింగ్ షో కు బ్రెజిల్ లో ప్రముఖ డైరెక్టర్ ఫెర్నాండో మీరెల్స్ కో-డైరెక్టు చేయనున్నారు. ఈ షోలో 300 మంది ప్రొఫెషనల్ డ్యాన్సర్ల డ్యాన్స్ లు * హైలైట్స్... ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే దేశాల పరేడ్, ఒలింపిక్ ప్రతిఙ్ఞ, ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలన, ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధ్యక్షుడి ప్రసంగం * స్టార్ ఎట్రాక్షన్స్...బ్రెజిల్ సూపర్ మోడల్ గిసెల్ బుండ్ చెన్, ట్రాన్స్ జెండర్ మోడల్ లీ టి, ప్రముఖ సింగర్ అనిత్తా సహా పలువురు మ్యుజిషియన్లు కేటనో వెలోసో, గిల్ బెర్టో గిల్ ల ప్రదర్శనలు * ప్రముఖ నటులు జుడీ డెంచ్, ఫెర్నాండా మోంటెనెగ్రో లు పోయెట్రీ రీడింగ్ * యూఎన్ ఓ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, సుమారు 100 దేశాలకు చెందిన ప్రతినిధులు సహా హాజరుకానున్న పలువురు ప్రముఖులు * ఫుట్ బాల్ దిగ్గజం పీలే చేతుల మీదుగా ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం * ప్రపంచ వ్యాప్తంగా సుమారు 900 మిలియన్ల ప్రజలు శనివారం ఉదయం రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలను వీక్షించనున్నట్లు క్రీడా పండితుల అంచనా.