: మమతా బెనర్జీకి డాక్టరేట్ ప్రకటించిన ఉక్రెయిన్ ప్రభుత్వం
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉక్రెయిన్ ప్రభుత్వం డాక్టరేట్ ప్రకటించింది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ రైల్వే ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ ఉక్రెయిన్ గవర్నమెంట్ పశ్చిమ బెంగాల్‌లో మమతా సర్కారు పనితీరుకు ఆమెకు డాక్టరేట్ ఇస్తున్నట్లు తెలిపింది. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఆమె తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రశంసించింది. దీదీకి డాక్టరేట్ ఇస్తున్నట్లు ఆమెకు ఆ రోజు ఆ దేశ ప్రభుత్వం లేఖ పంపించింది.