: ఎంసెట్-2 లీక్ కు రెండు నెలల ముందే స్కెచ్ వేసిన ముఠా


తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజ్ పై తవ్వే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నాయి. తాజాగా, ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు కీలక నిందితులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. బ్రోకర్లు గుడిపల్లి చంద్రశేఖర్, షేక్ షకీల్ ఈ లీకేజ్ లో కీలకపాత్ర పోషించినట్లు ఈ విచారణలో తేలింది. ఈ ఇద్దరు బ్రోకర్ల నుంచి కీలక సమాచారాన్ని అధికారులు సేకరించారు. ఇక్బాల్ అనే వ్యక్తి నుంచి తమకు పేపర్లు అందాయని, ఒక్కో విద్యార్థి నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేసినట్లు వివరించారు. విద్యార్థులను కోల్ కతా తీసుకువెళ్లి వారికి ప్రశ్నాపత్రాలను అందించామని బ్రోకర్లు పేర్కొనట్లు సమాచారం. ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీక్ చేసేందుకు రెండు నెలల ముందు నుంచే ముఠా స్కెచ్ వేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడైంది. ఈ రిపోర్టులో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. పేపర్ లీక్ నుంచి మెడికల్ సీటు ఇప్పించే వరకు ఇక్బాల్, రాజగోపాల్ రెడ్డి, గుడ్డూలు ప్లాన్ చేశారు. దేశ వ్యాప్తంగా 34 మంది బ్రోకర్లను ఇక్బాల్ నియమించుకున్నాడు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.40 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు బేరం కుదుర్చుకున్నట్లు అధికారుల సమాచారం. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. మరో నలుగురు నిందితుల కోసం సీఐడీ గాలింపు కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News