: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కమలహాసన్


సినీనటుడు కమలహాసన్ చెన్నైలోని తన కార్యాలయంలో గత నెల 13వ తేదీన మెట్లమీద నుంచి జారి పడిన విషయం తెలిసిందే. కుడికాలికి గాయమైన ఆయ‌న‌కి స్థానిక గ్రీన్స్‌రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జ‌రిగింది. ప్ర‌స్తుతం ఆయ‌న కోలుకుంటున్నార‌ని, ఆసుప‌త్రి నుంచి ఈరోజు డిశ్చార్జ్ అయ్యార‌ని వైద్యులు తెలిపారు. మరో నెల రోజుల పాటు క‌మ‌ల్ విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు. తాను త‌న కాలుకి శ‌స్త్ర‌చికిత్స చేయించుకొని లేచి నిలబడ్డానని క‌మ‌ల్ నిన్న సోష‌ల్‌మీడియా ద్వారా తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News