: సార్క్ సమావేశంలో కశ్మీర్ ప్రస్తావన తీసుకురాని నవాజ్ షరీఫ్.. ఉగ్రవాదంపై పోరాటం జరుపుతామని వ్యాఖ్య
ఇటీవలి కాలంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కశ్మీర్‌పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పాక్‌లో కశ్మీర్ కలిసే రోజు కోసం వేచిచూస్తున్నామని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో కశ్మీర్ అంశంపై ఆయన ఇస్లామాబాద్ లో జరిగిన సార్క్ సమావేశంలో తప్పక ప్రస్తావిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన కశ్మీర్ అంశాన్ని తన ప్రసంగంలో ఏ మాత్రం తీసుకురాకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాము సార్క్ దేశాలతో కలిసి ఉగ్రవాదంపై పోరాటం జరుపుతామని నవాజ్ షరీఫ్ సమావేశంలో వ్యాఖ్యానించారు. అంతేకాదు, తమ దేశం నుంచి ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.