: మార్బుల్స్ పాలిష్ చేసిన ధోనీ.. చాలా కష్టమనిపించిందట!
వికెట్ తీయడమే లక్ష్యంగా బౌలర్లు కసిగా విసిరిన బంతిని హెలికాప్టర్ షాట్‌లతో బౌండరీలు దాటించాడు. టీమిండియా కెప్టెన్‌గా జట్టుకి ఎన్నో విజయాలను అందించాడు. అయితే, తన పనిని పక్కకి పెట్టి కాసేపు వేరే పనిని చేయాలని చూసిన మహేంద్రసింగ్ ధోనీకి తనకి అలవాటు లేని పని ఎంతో కష్టంగా అనిపించిందట. ప్రస్తుతం తన ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న ధోనీ.. ఓ మిషన్‌ను చేతబట్టుకొని మార్బుల్స్ పాలిష్ పని చేశాడు. తాను ఆపనిలో నిమగ్నమయి ఉండగా తీసిన ఓ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనకు అలవాటు లేని పనిచేస్తుండగా తనకు అనిపించిన ఫీలింగ్‌ని ఆయన అభిమానులతో పంచుకున్నాడు. తన చేతులతో మార్బుల్స్‌ని పాలిష్ చేస్తే కానీ అది ఎంతకష్టమైన పనో తెలియలేదని ఆయన పేర్కొన్నాడు. కొన్ని పనులు వృత్తి నిపుణులే చేయాలేమో! అని ఆయన అభిప్రాయపడ్డాడు.